క‌రీంన‌గ‌ర్‌లో ఎస్సై వీరంగం.. ‘అన్నా’ అన్నందుకు వ్య‌క్తిపై దాడి

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులే అకార‌ణంగా సామాన్యుల‌పై దాడులు చేస్తే ఎవ‌రికి చెప్పుకోవాలి? బ‌ల‌హీనుల‌పై కండ బ‌లం, అధికార‌ బ‌లం చూపిస్తే ఎవ‌రిని న్యాయం అడ‌గాలి? యావ‌త్ పోలీస్ వ్య‌వ‌స్థ‌కే మ‌చ్చ తెచ్చే విధంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ పోలీస్ అధికారి. క‌రీంన‌గ‌ర్‌లో ఓ సామాన్యుడిపై ఓ పోలీస్ ఆఫీస‌ర్ దాడికి పాల్ప‌డ‌టం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రీంన‌గ‌ర్‌ (Karimnagar)లోని ఖాన్‌పుర‌లో మూడో టౌన్ ఎస్సై చంద‌ర్ (SI Chandar) ఓ సెలూన్ షాప్‌కు హెయిర్ క‌ట్ కోసం వెళ్లాడు. షాపులో ఉన్న రాములు కొద్దిసేపు త‌న ప‌ని చేసుకొని త‌ర్వాత ఎస్సైని కూర్చో అన్నా అన్నాడు. అంతే.. అన్నా అన్న ఆ ఒక్క మాట‌తో ఎస్సై రాములుపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.

న‌న్నే అన్నా అంటావారా అంటూ బూతుల‌తో రెచ్చిపోయాడు. రాములును అంద‌రూ చూస్తుండ‌గానే చిత‌క‌బాదాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇవి కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో పోలీస్ వ్యవస్థ తీరుపై, సామాన్యుల ప‌ట్ల పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై చందర్‌పై (Karimnagar SI) ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>