Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో నిప్పుల కొలిమిలా ఎండలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్​ లో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా నమోదవుతున్నాయి. దాదాపు 20కి పైగా జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటేసింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం వడగాలులు (Heatwaves) తీవ్రతరం అవుతుండడంతో జనం భయబ్రాంతులకు గురవుతున్నారు.

రాయలసీమ ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కేవలం రాయలసీమలోనే కాకుండా కోస్తా తీర ప్రాంతాల్లోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఉండడంతో కోస్తా తీర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు (Heatwaves) భారీగా వస్తుండడంతో బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. రానున్న కాలంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read Also: టోల్‌గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>