Mobile Popup Ad
Mobile Popup Ad

సర్కార్ చేతికి HYD మెట్రో రైలు.. చైర్మన్‌గా రామకృష్ణారావు నియామకం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)పై శనివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో బోర్డులో కీలక అధికారులను సర్కార్ నియమించింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రామకృష్ణారావును (CS Ramakrishna Rao) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మెట్రో ఎండీగా సర్పరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. మెట్రో డైరెక్టర్‌లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ ఉండనున్నారు. ఈ నిర్ణయంతో రేవంత్ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు వెళ్ళింది. ఈ మేరకు ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ వాటాలను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 30న రూ.15 వేల కోట్ల డీల్ పూర్తికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో హైదరాబాద్ మెట్రో నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ (L&T) మెట్రోకు ఉన్న 100% ఈక్విటీని రేవంత్ సర్కార్ తన వశం చేసుకుంది. దీంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం కిందికి హైదరాబాద్ మెట్రో వచ్చింది.

ఈ నిర్ణయంలోని ముఖ్యాంశాలు:

భారీ డీల్: సుమారు రూ.15,000 కోట్ల భారీ ఒప్పందంతో మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేస్తోంది. ఇందుకోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రూ.13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొత్త బోర్డ్ నియామకం: మెట్రో నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించింది. చైర్మన్‌గా కె. రామకృష్ణరావు, మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరిస్తారు. వీరితో పాటు మరికొంతమంది సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు బోర్డులో సభ్యులుగా ఉంటారు.

ప్రయాణికులకు లాభం: మెట్రో పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతిలోకి రావడం వల్ల భవిష్యత్తులో మెట్రో విస్తరణ పనులు వేగవంతం అవుతాయి. అలాగే టికెట్ ధరల నియంత్రణ నేరుగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండటంతో సామాన్య ప్రయాణికులకు మేలు జరుగుతుంది.

నిర్వహణ: L&T సిబ్బంది కొనసాగింపు, ఇతర సాంకేతిక ఒప్పందాలపై హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) ఎండీ చర్చలు జరిపి పనులు ఎక్కడా ఆగకుండా చూస్తారు. నగర రవాణా వ్యవస్థలో ఇదొక గొప్ప ముందడుగు కానుంది.

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>