Mobile Popup Ad
Mobile Popup Ad

క్రీడలతోనే శారీరక దృఢత్వం: కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

కలం, కరీంనగర్ బ్యూరో: క్రీడల ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నగరంలో యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల నేపథ్యంలో మూడో రోజు బుధవారం జిల్లా యువజన క్రీడా శాఖ, టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో “హెరిటేజ్ వాక్” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ న‌రేంద‌ర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పచ్చ జెండా ఊపి అంబేడ్కర్ స్టేడియం నుండి హెరిటేజ్ వాక్ ర్యాలీని ప్రారంభిచారు.

వారసత్వ సంపద, సంస్కృతిని కాపాడుకోవాలనే గొప్ప సందేశంతో సాగిన హెరిటేజ్ వాక్‌లో క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నగర ప్రధాన వీదుల గండా ఉత్సాహ‌భ‌రితంగా భారీ ర్యాలీ చేశారు. అనంతరం కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ న‌రేంద‌ర్‌ రెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో కొనసాగుతున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరంలో విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్బంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించాలంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యం అన్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడాకారులు క్రమశిక్షణతో కూడిన నైపుణ్యాలను నేర్చుకోవాలని పిలుపు నిచ్చారు. మన వారసత్వ సంపదను, సంస్కృతిని కాపాడుకోవడంలో యువత పాత్ర చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఎంవైబి కో ఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, ఓలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి, హెరిటేజ్, టూరిజం శాఖ ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాల నిర్వాహకులు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయుల, విద్యార్థులు పాల్గొన్నారు.

 Read Also: మోడీ.. ‘మెలోడీ’.. నష్టాల నుంచి భారీ లాభాల్లోకి పార్లే షేర్స్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>