కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఇటీవల ఐదువేల ఎస్సై, కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా మరో 2,437 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్లో 790, జైలు విభాగంలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1,424 పోస్టులు ఉన్నాయి. దీంతో మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) వెల్లడించింది.
అంతకుముందు 5000 పోస్టులకు సంబంధించిన జీవోను TSLPRB జారీ చేసింది. ఇందులో ఎస్ 148, సివిల్ కానిస్టేబుల్ 3697, కానిస్టేబుల్ ఏఆర్ 152, రిజర్వ్ 14, ఆర్ఎస్ఐ 12 ఇతర పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. తాజాగా పోస్టులను పెంచి 7,437 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటీఫికేషన్ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయనుంది.

