Mobile Popup Ad
Mobile Popup Ad

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై భద్రాద్రి కలెక్టర్ కీలక వ్యాఖ్యలు

కలం, ఖమ్మం బ్యూరో:  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయపార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశమందిరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో (Bhadradri Kothagudem) చేపట్టనున్న ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా నిర్వహించేందుకు రాజకీయపార్టీలు తమ బూత్‌లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. బీఎల్‌వోలు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమానికి రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. జూన్ నుంచి బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, తిరిగి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియ జూన్ 26 న ప్రారంభమై జూలై 24 లోపు పూర్తవుతుందన్నారు. అనంతరం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, తదుపరి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అలాగే అక్టోబర్ 10 న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు.

చిరునామా మార్పులు, ఇతర సవరణల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓటర్లు తమ పేరు ఎస్‌ఐఆర్-2002 జాబితాలో ఉందో లేదో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, అధికారిక వెబ్‌సైట్ లేదా ఈసీఐ ఓటర్స్ పోర్టల్‌లో “సెర్చ్ బై ఎలెక్టర్ డిటైల్స్” ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్చికమని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారు ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న వారికి అవకాశం ఉంటుందని తెలిపారు.

ఫారం నింపడంలో లేదా వివరాల ధృవీకరణలో సహాయం కోసం బీఎల్‌వోలు, 1950 హెల్ప్‌లైన్, ఈసీఐ ఓటర్స్ పోర్టల్ “బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో” సౌకర్యాలను వినియోగించుకోవచ్చని సూచించారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్న ఓటర్ల తరపున కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఫారం నింపి బీఎల్‌వోకు సమర్పించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యత, ఫారాల నింపే విధానంపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు.

 Read Also: మోడీ.. ‘మెలోడీ’.. నష్టాల నుంచి భారీ లాభాల్లోకి పార్లే షేర్స్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>