Mobile Popup Ad
Mobile Popup Ad

కోదాడలో భారీ పేలుడు.. తప్పిన ప్రాణాపాయం!

కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad Blast ) పట్టణంలోని రంగ థియేటర్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది. పేలుడు శబ్ధం వినిపించడంతో పరిసర ప్రాంతమంతా ఒక్కసారిగా దద్ధరిల్లగా.. సమీపంలో ఉన్న వారు భయంతో రోడ్డుపై పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, గల్లీలో ఉన్న ఎల్పిజి గ్యాస్ రీఫిల్ చేసే ఒక షాపు నుంచే ఈ పేలుడు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాని సమీపంలోని జ్యూస్ సెంటర్ షాపు మొత్తం ఒక్కసారిగా కంపించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>