బినామీల పేర్లతో లంచం.. ఏసీబీ వలలో అధికారి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్ అవినీతికి పాల్పడి ఏసీబీ (ACB) వలలో చిక్కారు. సోమవారం ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించేందుకు ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి మధుసూదన్ లంచాలు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు అందాయి. యూపీఐ లావాదేవీల ద్వారా ఆయన లంచం తీసుకుంటున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

పక్కా ఆధారాలు సేకరించిన అధికారులు మధుసూదన్‌ను అదుపులోకి తీసుకొని కీలక విషయాలు రాబట్టారు. భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌లో బినామీ పేరుతో ఖాతాను ఉపయోగించినట్లు అధికారులు తేల్చారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ మద్య కాలంలో ఈ ఖాతా ద్వారా రూ.14,77,033 లను నిందితుడు దుర్వినియోగం చేసి అక్రమంగా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు (ACB Special Court) ముందు హాజరుపరిచారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Read Also: ఎల్‌పీజీ కొరత వేళ నాదెండ్ల కీలక స్టేట్‌మెంట్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>