బీజేపీ మాస్టర్ ప్లాన్.. బెంగాల్ తొలిజాబితా రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ (BJP) భారీ ప్లాన్ వేస్తోంది. నిన్న నోటిఫికేషన్ వస్తే.. నేడు ఏకంగా బెంగాల్ తొలి జాబితాను ప్రకటించేసింది. 144 మంది అభ్యర్థుల లిస్ట్ ను బీజేపీ విడుదల చేసింది. ఇందులో బీజేఎల్పీ నేత సువేందు అధికారితో పాటు అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 144 మందిలో 10 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్న బెంగాల్ లో అప్పుడే సగం మందిని బీజేపీ ప్రకటించేసింది.

బెంగాల్ ఎన్నికలు (West Bengal Elections) రెండు దశల్లో జరగబోతున్నాయి. ఏప్రిల్ 23న తొలి దశలో 152 స్థానాలకు, ఏప్రిల్ 29న రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల నామినేషన్లకు ఇంకా 14 రోజుల సమయం ఉండగానే.. అందరికంటే ముందే బీజేపీ (BJP) అభ్యర్థులను ప్రకటించేస్తోంది. చూస్తుంటే రెండో లిస్ట్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించేసి వారికి ప్రచారం చేసుకునే సమయం ఇవ్వడం వల్ల ప్రజల్లోకి వెళ్తారని బీజేపీ భావిస్తోంది. ఈ సారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో గెలిచేందుకు బీజేపీ (BJP) పెద్ద ప్లానే వేస్తోంది. ముందస్తు ప్లాన్ లో భాగంగానే ఈ లిస్ట్ రిలీజ్ చేసింది.

Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. సర్‌ప్రైజ్ టూర్‌తో సస్పెన్స్?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>