కలం, వెబ్ డెస్క్: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ‘ఈగల్ టీం’ అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొనియాడారు. సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్ చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం లోక కళ్యాణం కోసమేనని స్పష్టం చేశారు. మాది గడీల పాలన కాదు.. ప్రజా పాలన అని పేర్కొంటూ, అసెంబ్లీలో చర్చలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం డ్రగ్స్ (Drugs) నివారణకు ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. అసెంబ్లీలో డ్రగ్స్ అంశంపై చర్చ జరపాలా వద్దా అనే విషయాన్ని సభనే నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలనుద్దేశించి మాట్లాడారు.
Read Also: పోలీస్ శాఖలో మళ్లీ ఆర్డర్లీ వ్యవస్థ..!
Follow Us On: Sharechat

