కరీంనగర్ లో ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలు : సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసి 4వ మహాసభలు సెప్టెంబర్ నెలలో కరీంనగర్ (Karimnagar) లో జరగనున్నదని, దానిని విజయవంతం చేయడానికి కార్మిక లోకం కదం తొక్కాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐటీయూసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని, ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఉందని చెప్పారు. నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షక, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఖిల్లాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న జిల్లా కరీంనగర్ అని, అలాంటి జిల్లా లో 2012లో భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్మిక క్షేత్రానికి నిలయమైన ఈ జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్మికునిపై ఉందని చెప్పారు. మహాసభలకు సంబంధించిన ఆహ్వాన సంఘం కమిటీని, ఇతర కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని అందుకు అన్ని విధాలుగా పార్టీ సహాయ సహకారాలు ఉంటాయని వెంకటరెడ్డి (Chada Venkata Reddy) తెలిపారు.

ఈ సమావేశములో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వి.ఎస్.బోస్, కరీంనగర్, మంచిర్యాల,పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సీపీఐ కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, తాండ్ర సదానందం, చెన్న విశ్వనాథం, మంద సుదర్శన్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యూసఫ్, బాల్ రాజ్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జి.వెంకటేష్, కరుణ, ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శులు కదారి సునీల్, రాములు, వేణు,పిట్టల సమ్మయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read Also: కేరళం సీఎం ఎవరు? రేసులో ముగ్గురు హేమాహేమీలు

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>