Mobile Popup Ad
Mobile Popup Ad

కేరళం సీఎం ఎవరు? రేసులో ముగ్గురు హేమాహేమీలు

కలం, వెబ్ డెస్క్: పదేండ్ల తర్వాత కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘనవిజయం సాధించి, అధికారాన్ని కైవసం చేసుకుంది. 140 స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్ 102 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ సీఎం (Kerala CM) ఎవరనే అంశంపైనే ఉంది. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సతీశన్, ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ ప్రచారానికి సారథ్యం వహించారు. కూటమిని విజయతీరాలకు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సతీశనే.. సీఎం అవుతారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న కేసీ వేణుగోపాల్ (KC Venugopal) పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడైన ఆయనను సీఎంగా (Kerala CM) పంపడం ద్వారా రాష్ట్రంలో విభేదాలను చక్కదిద్దవచ్చని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన రమేష్ చెన్నితాల అనుభవం తమకు కలిసి వస్తుందని ఆయన వర్గం వాదిస్తున్నది. గతంలో హోం మంత్రిగా పనిచేసిన అనుభవం.. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు ఆయనను రేసులో నిలబెట్టాయి. ముగ్గురు నాయకులు సీఎం పదవికి సమాన అర్హతలు ఉన్నవారేనని సీనియర్ నేత ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన తర్వాత, కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.

వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యేల మద్దతు విషయానికి వస్తే.. మెజారిటీ ఎమ్మెల్యేలు చెన్నితాల, వేణుగోపాల్ వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తున్నది. యువ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపు ఉండగా.. పాత తరం నేతలు చెన్నితాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల మద్దతు సతీశన్‌కు ఉన్నప్పటికీ, ఆయన వెనుక ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉందని సమాచారం. యూడీఎఫ్ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బహిరంగంగానే వీడీ సతీశన్కు మద్దతు ప్రకటించింది. ప్రతిపక్షనేతగా ఆయన పోరాటం, ప్రజల్లోకి వెళ్లిన తీరు అద్భుతమని ఐయూఎంఎల్ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ కొనియాడారు.

Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>