కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) కోసం ఆమె మామ రాం కిషన్ రావు రంగంలోకి దిగారు. కవిత పార్టీకి ప్రజలు అండగా నిలువాలని కోరారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ జెండాను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు ఆవిష్కరించారు. నవీపేట్ మండలం పోతంగల్ గ్రామం కవిత మెట్టినిల్లు.. రామ్ కిషన్ రావు కేసీఆర్ వియ్యంకుడిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. కానీ క్రియాశీలకంగా కాదు. ఇప్పుడు కవిత పార్టీ పెట్టడంతో యాక్టివ్ అయి.. జిల్లాలోని పలు చోట్ల పర్యటిస్తూ కవితకు మద్దతు కూడగడుతున్నారు.
రెంజల్ ఎడపల్లి మండలాల్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణలు
ఎడపల్లి మండం కేంద్రంలోని మంగళ్ పహాడ్ క్రాసింగ్ వద్ద టీఆర్ఎస్ (TRS) జెండాను ఆపార్టీ జిల్లా అడహక్ కమిటీ సభ్యుడు రాచర్ల శేఖర్ రాజ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. జనం కోసమే తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, రెంజల్ మండలం తాడ్ బిలోలి సర్పంచ్ తెలంగాణ శంకర్ అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం నిర్వహించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలకు అవసరమైన కూడు, గూడు, విద్య, వైద్యం ఉచితంగా అందించేందుకు టీఆర్ఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.. ఈ కార్యక్రమాల్లో రెంజల్ మండల ప్రతినిధులు నవీపేట టీఆర్ఎస్ నాయకులతో పాటు నవీనాచారి, అవంతి రావ్, దొంత ప్రవీణ్ కుమార్, విజయలక్ష్మి, సాయి కుమార్ గౌడ్, శ్రీకాంత్, నరహరి, అంజలి, వరలక్ష్మి, లక్ష్మినారాయణ భరద్వాజ్, ఎంఏ రజాక్, పంచరెడ్డి మురళి, భూషణ్, తదితరులున్నారు.
Read Also: ఎల్ నినో కరువు ముప్పు.. తాతలనాటి నేరేడు రహస్యం ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp

