మీర‌ట్‌లో పోలీసుల‌పై క‌న్వ‌రియాల దాడి

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌ (Meerut)లో క‌న్వ‌రియాలు (Kanwariyas) రెచ్చిపోయారు. ఓ యాక్సిడెంట్ విష‌య‌మై ఏకంగా పోలీసులపైనే ఘోరంగా దాడి చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. గంగాజలంతో వెళ్తున్న కన్వరియాలను ఓ బైక‌ర్‌ ఢీకొట్టి పరార‌య్యాడు. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు కొంద‌రు పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అయితే ఈ క్ర‌మంలో బైక‌ర్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. వెంట‌నే క‌న్వ‌రియాలు పోలీసులపై విరుచుకుపడ్డారు. బైకర్ పారిపోవడానికి పోలీసులే కారణమంటూ తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పోలీసుల బట్టలు చించి, కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>