కలం, స్పోర్ట్స్: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) ఇంగ్లాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ (Nat Sciver Brunt) కాలి గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్కాట్లాండ్, వెస్టిండీస్‌తో జరిగే తదుపరి రెండు గ్రూప్ మ్యాచ్‌లకు దూరమైంది. ఈ నేపథ్యంలో మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హార్ట్‌లీ, స్కివర్-బ్రంట్‌ను జట్టులో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా కొనియాడింది. ఆమె బ్యాటింగ్‌లో తొందరపడకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించుకుంటుందని, ఆ తర్వాత వేగం పెంచి ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తుందని తెలిపింది.
ప్రపంచకప్‌లో స్కివర్-బ్రంట్ (Nat Sciver Brunt) ఇప్పటికే చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచింది. గతంలో షార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 768 పరుగుల రికార్డును అధిగమించి, ప్రస్తుతం 784 పరుగులకు చేరుకుంది. ఈ టోర్నీలో ఆమె ఫామ్ కూడా ఆకట్టుకుంటోంది. శ్రీలంకపై అజేయంగా 46 పరుగులు చేసిన ఆమె, ఐర్లాండ్‌పై 48 పరుగులతో ఇంగ్లండ్ విజయానికి బలమైన పునాది వేసింది. ఇప్పటివరకు 94 పరుగులు చేసి ఒక్కసారి కూడా ఔట్ కాలేదు.
బౌలింగ్‌లోనూ ఆమె జట్టుకు కీలకమని హార్ట్‌లీ పేర్కొంది. సరైన లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీయగల సామర్థ్యం ఆమెకు ఉందని వివరించింది. బ్యాట్, బాల్ రెండింటితోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల నిజమైన మ్యాచ్ విన్నర్ అని చెప్పింది. అయితే గాయం కారణంగా ప్రస్తుతం రెండు మ్యాచ్‌లకు దూరమైన స్కివర్-బ్రంట్, నెలాఖరులో న్యూజిలాండ్‌తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: అక్కడ బీచ్‌లో నిద్రపోతున్న జనం.. ఎందుకంటే?
Follow Us On : WhatsApp

