రామ జన్మభూమి బోర్డుకు జోషి రాజీనామా

క‌లం, వెబ్‌డెస్క్‌: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ట్రస్ట్ పాలక్ పదవిలో ఉన్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషి (Suresh Bhaiyyaji) తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తున్నది. అయితే తాను 78 ఏళ్ల వయసులో ఆరోగ్యసమస్యల కారణంగా పదవికి రాజీనామా చేసినట్టు భయ్యాజీ జోషి ప్రకటించారు. అయోధ్య రామాలయ విరాళాలకు సంబంధించి ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

మరోవైపు రాజీనామాకు ఆ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం ఉందని ట్రస్ట్ అధికారికంగా ప్రకటించలేదు. ట్రస్ట్‌లో ‘పాలక్ ’ గా ఉన్న భయ్యాజీ జోషి రోజువారీ వ్యవహారాల కంటే సలహాదారుడి పాత్రనే ఎక్కువగా నిర్వహించినట్లు ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు హాజరయ్యేవారు కానీ అయోధ్యలో బహిరంగ కార్యక్రమాల్లో అరుదుగానే కనిపించేవారు. భయ్యాజీ జోషి 2009 నుంచి 2021 వరకు ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా 12 సంవత్సరాలు పనిచేశారు. ఆ పదవిలో అత్యధిక కాలం పనిచేసిన నాయకుల్లో ఆయన ఒకరు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వాల మధ్య సమన్వయకర్తగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఇదిలా ఉండగా, రామాలయ నిర్మాణం కోసం సేకరించిన విరాళాల నిధుల నిర్వహణపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ అంశం పార్లమెంట్‌లో కూడా ప్రస్తావనకు వచ్చింది. భయ్యాజీ జోషితో పాటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంపత్ రాయ్ కూడా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు భయ్యాజీ జోషి బాధ్యతలను ఎవరు చేపడతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>