కలం, తెలంగాణ బ్యూరో: ‘‘బీఆర్ఎస్ పాలనలో అనేక వర్గాలకు అన్యాయం జరిగింది. నేను ఇన్నేండ్లు అదే పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి’’… తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల తరచూ చెప్తున్న మాట ఇది..! బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కవిత ఒప్పుకుంటున్నారు. అన్యాయం జరిగిన వర్గాలకు బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఆయా వర్గాల సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొట్లాడతానని హామీ ఇస్తున్నారు.
త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న కవిత చెప్తున్న మాటల్లో, క్షమాపణల్లో నిజమెంత? ఆమె నిజంగానే అమరుల కుటుంబసభ్యులు, ఉద్యమకారులు, బీసీలకు తన పార్టీలో ప్రాధాన్యం ఇస్తారా? రైతులు, ఉద్యోగులు, ఇతర వర్గాల సమస్యలను పరిష్కరిస్తారా? బీఆర్‌ఎస్‌లో తెలిసో, తెలియకో జరిగిన తప్పులను ఇప్పుడైనా సరిదిద్దుకుంటారా? లేదంటే సారీలతోనే సరిపెడ్తారా? కేవలం ఓట్ల కోసమే కవిత ఈ క్షమాపణలు చెప్తున్నారా? వీటన్నింటిపై కలం ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను: కౌశిక్ రెడ్డి
Follow Us On : WhatsApp

