కలం, వెబ్ డెస్క్ : ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2 ) బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ మూవీ విడుదలైన కేవలం 11 రోజుల్లోనే రూ.1390+ కోట్లు (గ్రాస్) వసూళ్లు చేసినట్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ‘ధురంధర్’ లైఫ్‌టైమ్ కలెక్షన్ల( రూ.1350+ కోట్లు (గ్రాస్))ను దాటి ‘ధురంధర్ 2’బాక్సాఫీస్ వద్ద తన జైతయాత్రను కొనసాగిస్తోంది. ఈ భారీ వసూళ్లతో భారత సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన నాలుగో చిత్రంగా ‘ధురంధర్ 2’ నిలిచింది. ఈ జాబితాలో రూ.2000+ కోట్లతో తొలిస్థానంలో ‘దంగల్’ ఉంది. ‘బాహుబలి 2’ (రూ.1810+ కోట్లు), ‘పుష్ప 2’ (రూ.1800+ కోట్లు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
‘ధురంధర్ 2’ రికార్డుల వేట..
ఈ నెల 19న బాక్సాఫీసు ముందుకొచ్చిన ‘ధురంధర్ 2’ రికార్డుల వేటను కొనసాగిస్తోంది. కేవలం ఇండియాలోనే ‘ధురంధర్ 2’ ఇప్పటివరకు రూ. 1,045.81 కోట్ల గ్రాస్ (రూ. 875.21 కోట్ల నెట్) వసూలు చేసింది. తద్వారా అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ప్రభాస్ ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ తర్వాత భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ‘ధురంధర్ 2’ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదలైన ‘ధురంధర్’ రూ.1350+ కోట్లు రాబట్టడం ఓ రికార్డు కాగా… ఈ చిత్రం రెండు పార్ట్ లు కలిపి అత్యధిక వసూలు చేసిన సినిమాల జాబితాలో టాప్ లో నిలవడం మరో రికార్డు.
కర్ణాటకలోనూ భారీ రికార్డు..
దక్షిణ భారతదేశంలోనూ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో రూ.100+ కోట్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్ 2’ భారీ రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.1390+ కోట్లు (గ్రాస్) కొల్లగొట్టిన ఈ మూవీ.. టాప్ 3 లోకి చేరాలంటే దాదాపు రూ.400 కోట్లు రాబట్టాల్సి ఉంది. పుష్ప 2 , బాహుబలి 2 లను ఈ చిత్రం క్లోజింగ్ లో దాటే అవకాశాలు ఉన్నాయి. కానీ, దంగల్ ని దాటడం కష్టమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదలైంది. దీని ప్రభావం ఈ మూవీపై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్లు ఎంత వరకు క్లోజ్ అవుతాయో చూడాలి.
Read Also: పిల్లలు సంతోషాన్ని పెంచరు.. పరిశోధనలో విస్తుబోయే విషయాలు..!
Follow Us On : WhatsApp

