కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో హనుమాన్ శోభాయాత్రలపై ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ (Dinesh Patel Kulachari) స్పష్టంగా స్పందిస్తూ.. హనుమాన్ శోభాయాత్రలు ఎట్టి పరిస్థితుల్లో ఆగవని, అవి జరిగి తీరుతాయని ప్రకటించారు. పోలీసులు వివిధ నిబంధనలను సాకుగా చూపుతూ ఈసారి ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆయన హనుమాన్ జయంతి ఉత్సవాల (Hanuman Jayanti Celebrations) ప్రాధాన్యతను ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం ఇందూరు నగరం (నిజామాబాద్)తో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. వేకువజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు సారంగాపూర్ హనుమాన్ మందిరంకు శోభాయాత్రగా వెళ్లడం ఆనవాయితీ అని చెప్పారు. అనంతరం కంటేశ్వర్ వద్ద ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర తెలంగాణలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఈ ర్యాలీల్లో లక్షలాది మంది భక్తులు శాంతియుతంగా పాల్గొంటారని, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పోలీసులు ఎలాంటి అడ్డంకులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అలాగే భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా చేసి, ర్యాలీలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని దినేష్ పటేల్ (Dinesh Patel Kulachari) విజ్ఞప్తి చేశారు.
Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?
Follow Us On : WhatsApp

