నకిలీ పాస్టర్ అభినయ్‌కు శిక్ష పడాలి: కేఏ పాల్

కలం, వెబ్ డెస్క్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) నకిలీ పాస్టర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభినయ్ దర్శన్‌పై(Abhinay Darshan)  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేరు, డబ్బు కోసం అభినయ్ తనపై తానే దాడి చేయించుకున్నారని ఆరోపించారు. అభినయ్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్, ఈ వ్యవహారంపై పోలీసులతో మాట్లాడి అతడిని అరెస్ట్ చేయించానని వెల్లడించారు. ఇటువంటి ఘటనలతో క్రైస్తవ సమాజ ప్రతిష్ట దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో చర్చిలను మూయిస్తూ, పాస్టర్లపై దాడులు చేయిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>