కలం, వెబ్ డెస్క్ : ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) శనివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగే ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కొత్త పార్టీ స్థాపన తర్వాత ఆమె అధికారికంగా సమావేశంలో ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా తన కొత్త పార్టీ దార్శినికతను, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఆమె మీడియా ముందు పంచుకోనున్నారు. అలాగే తొలుత తెలంగాణ రాజ్య సేన పేరుతో స్థాపించిన తన పార్టీ పేరు ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్పు చెందడంపై ఆమె వివరణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీ పార్టీల తీరుపై ఆమె తనదైన శైలిలో రాజకీయ విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. దీంతో పార్టీ స్థాపన తర్వాత కవిత ఏర్పాటు చేయబోయే తొలి మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉంటే తెలంగాణ రాజ్య సేన (TRS) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో TRS పేరుపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆమె టీఆర్ఎస్ పేరును వాడుకోవడానికి వీలు లేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు (Kavitha) ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. ఆమె ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు ఈసీ ఆమోదం తెలిపింది. అయితే ఆమె తెలంగాణ రాష్ట్ర సేన పేరు మీద కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత పార్టీకి అనుమతించింది. అధికారులు బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి వచ్చి అధికారిక పత్రాలు సమర్పించారు. దీంతో కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పార్టీని నడుపుకునే వీలు కలిగింది.
Read Also: టార్గెట్ క్యూబా.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
Follow Us On: WhatsApp

