టార్గెట్ క్యూబా.. ట్రంప్ మరో సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ తో యుద్ధం ముగుస్తున్న వేళ క్యూబాను స్వాధీనం చేసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లు.. ఇరాన్ నుంచి వచ్చే దారిలో ఈ ఆపరేషన్ పూర్తవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్యూబాను లొంగదీసుకోడానికి విమాన వాహన నౌకను తీరానికి దూరంగా మోహరిస్తామని చెప్పారు.

“అమెరికా.. క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటుంది. క్యూబన్లకు సమస్యలు ఉన్నాయి. ఆ దేశ అధినేత లొంగిపోవాలి. ఇరాన్ నుండి తిరిగి వచ్చేటప్పుడు, మా పెద్ద నౌకలలో ఒకటైన, ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలుపుతాము. కేవలం బల ప్రదర్శనతోనే క్యూబా లొంగిపోతుంది” అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>