Mobile Popup Ad
Mobile Popup Ad

దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. తప్పుకున్న జడ్జి

కలం, వెబ్ డెస్క్: అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత, మనీష్ సిసోడియా వంటి కీలక నేతలు జైలు పాలైన దిల్లీ మద్యం కేసు (Delhi Liquor Case) విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించడంతో, ఆమె స్థానంలో జస్టిస్ మనోజ్ జైన్ ఇక నుంచి వాదనలు వింటారని రిజిస్ట్రీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పరిగణనలోకి తీసుకుని.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ అలాగే తప్పుకోవడం గమనార్హం.

కేజ్రీవాల్ వద్దనడానికి కారణం ఇదే..

జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసు విచారణ చేపట్టడంపై అరవింద్ కేజ్రీవాల్ అభ్యంతరం తెలుపుతూ వస్తున్నారు. తాను తీవ్రంగా వ్యతిరేకించే ఆరెఎస్సెస్‌తో పాటు ఏబీవీపీ సదస్సులకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ పలుమార్లు హాజరయ్యారని కేజ్రీవాల్ తెలిపారు. అలాగే జడ్జి కుమార్తె, కుమారుడు కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్లుగా వ్యవహరిస్తున్నారని కూడా వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ కేసులో విచారణ అధికారిగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఉండటం కరెక్ట్ కాదని వాదించారు. అయితే కేజ్రీవాల్ తో పలుమార్లు జడ్జి విబేధించినా.. చివరకు తప్పుకున్నారు. అదే సమయంలో, న్యాయమూర్తికి ఉద్దేశాలు ఆపాదించినందుకు వారిపై కోర్ట్ ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ రివ్యూ.. నేతలకు కీలక సూచనలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>