ఎంపీ అరవింద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి : బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

కలం, కరీంనగర్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి (Bomma Sriram Chakravarthi) తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విమర్శలు ప్రజా అంశాలపై ఉండాలని, దేశ అత్యున్నత పదవులు, రాజ్యాంగ హోదాల్లో ఉన్న నాయకులపై ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎంపీ అరవింద్‌పై బీజేపీ అధిష్ఠానం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన (Bomma Sriram Chakravarthi) డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు. రేవంత్ రెడ్డి.. మరో సువేందు అవుతారేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ ఆయనకు మోదీతో లింకు ఉందని ఆరోపించడం తగదన్నారు. ప్రధానమంత్రి పేరును అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగడం బాధ్యతాయుత రాజకీయాలకు సరిపడదని చెప్పారు. అలాంటి వ్యాఖ్యలను బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తీవ్రంగా ఖండించారు.

కాంగ్రెస్‌లోకి రేవంత్ రెడ్డి ఎలా వచ్చారు. ఎలా అధికారంలోకి తెచ్చారన్నది దేశానికి, మోదీకి కూడా తెలుసన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఏ పార్టీ నుంచి వచ్చారని బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ప్రశ్నించారు. తెలివి లేక అరవింద్ దద్దమ్మ మాటలు మాట్లాడటం సిగ్గుచేటు కాదా అని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హుందాతనం పాటించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని స్పష్టం చేశారు. బిజెపి అధిష్ఠానం వెంటనే స్పందించి అరవింద్‌పై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో స్పందిస్తాయని శ్రీరామ్ చక్రవర్తి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>