epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జ్ఞానపీఠ్​ గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత

కలం, వెబ్​డెస్క్​: ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త, జ్ఞాన్​పీఠ్​ పురస్కార గ్రహీత వినోద్ కుమార్​ శుక్లా (Vinod Kumar Shukla) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాయ్​పూర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఈ మేరకు ఆయన కుమారుడు శాశ్వత్​ శుక్లా వెల్లడించారు. కాగా, హిందీ సాహిత్య సీమలో వినోద్​ కుమార్​ శుక్లా(89) శిఖర సమానుల్లో ఒకరు. ఆయన రాసిన నౌకర్​ కీ కమీజ్​, ఖిలేగా తో దేఖేంగే, ఏక్​ చుప్పీ జగహ్, దివార్​ మే ఏక్​ ఖిడ్కీ రహతీ థీ, పచీస్ కవిత రచనలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. సాహిత్య రంగంలో చేసిన కృషికి గాను ఈ ఏడాదే ఆయనకు సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఙానపీఠ్​ లభించింది. నవంబర్​ 21న ఆయన నివాసంలోనే ఈ అవార్డును అందించారు. కాగా, వినోద్​ కుమార్​ శుక్లా మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్​ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ‘‘వినోద్​ కుమార్​ మరణం అత్యంత బాధాకరం. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన అమూల్యమైన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఓం శాంతి”అని తన ట్వీట్​లో ప్రధాని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>