కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని పాలేరు చెరువు (Paleru Cheruvu) మరోసారి వార్తల్లో నిలిచింది. కూసుమంచి మండలం పరిధిలోని ఈ చెరువులో ఓ జాలరి వలకు అరుదైన జెల్ల చేప చిక్కడం స్థానికంగా ఆసక్తి రేకెత్తించింది. ఖమ్మం జిల్లా, కిష్టాపురం గ్రామానికి చెందిన జూలూరి రాములు తెల్లవారు జామున చేపల వేటకు వెళ్లగా, ఆయన వలకు సుమారు 15 కిలోల బరువున్న ‘జెల్ల’ జాతికి చెందిన చేప పడింది. స్థానికంగా ‘బచ్చల జెల్ల’ గా పిలిచే ఈ చేపలు సాధారణంగా 2–3 కిలోల బరువుకే మార్కెట్‌కు తీసుకెళ్తారు. కానీ కొన్ని చేపలు వలలకు చిక్కకుండా చెరువులోనే మిగిలిపోతే, అవి 10 నుంచి 15 కిలోల వరకు పెరుగుతాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఇంత భారీ పరిమాణంలో జెల్ల చేప దొరకలేదని రాములు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన చేపను చూసేందుకు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మార్కెట్‌లో ఈ చేపకు సుమారు రూ.1500 నుంచి రూ.2000 వరకు ధర లభించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్
Follow Us On: Instagram

