ఐలాపురంలో ఆక్రమణలు తొలగింపు.. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న బాధితులు

కలం, వెబ్ డెస్క్ : ఐలాపురం (Ailapuram) లో భూ ఆక్రమణలు తొలగించడంతో స్థానికులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కబ్జా చెర నుంచి భూములకు విముక్తి కల్పించిన హైడ్రాకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు స్థానికులు పాలాభిషేకం చేశారు. కబ్జాదారుడు ఎంఏ ముఖీం పై లేఔట్ యజమానులు తీవ్ర ఆరోపణలు చేశారు. భూబకాసురుడి నుంచి తమకు విముక్తి కలిగిందని ఐలాపురం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖీం బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజా ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ ప్రభుత్వ భూమిని ఇష్టానుసారం అమ్ముకుని వందల కోట్లు పోగేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని అమ్మడంతో వచ్చిన డబ్బులతో ముఖీం ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. మాధాపూర్ లో 12 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో ముఖీంపై మోస్ట్ నటోరియస్ కేసులు నమోదయ్యాయి.

సివిల్ కేసులతో పాటు డబుల్ మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే, ఎమ్మార్వోను బెదిరించడంతో పాటు లే ఔట్లు చూడడానికి వచ్చిన వారిని బెదిరించారంటూ రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ముఖీం గన్ లైసెన్స్ ను రద్దు చేసి స్వాధీనం చేసుకున్నారు. రాజ‌గోపాల్‌న‌గ‌ర్ కాల‌నీలో ముఖీం అమ్మేసిన ప్లాట్ల‌లో క‌ట్టిన ఇళ్ల‌ను, దుకాణాల‌ను మొత్తం 250 వ‌ర‌కూ అప్ప‌టి రెవెన్యూ అధికారులు 2023లో కూల్చేవేశారు. తరువాత యథాస్థితిని కొన‌సాగించాల‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన‌ప్ప‌టికీ.. ముఖీం ఐలాపురం (Ailapuram) లో భూముల‌ను అమ్మి సొమ్ము చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>