Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీవారి సన్నిధిలో ‘పెద్ది’ బ్యూటీ: కాలినడకన తిరుమలకు

కలం, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

భక్తిశ్రద్ధలు గల జాన్వీ కపూర్ కు వీలు దొరికినప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక అలవాటు. అయితే ఈసారి ఆమె తన తాజా చిత్రం ‘పెద్ది’ విడుదల సందర్భంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్నారు. వచ్చిన ప్రతిసారి దాదాపుగా కాలినడకనే కొండపైకి వెళ్లే సాంప్రదాయాన్ని ఆమె ఈసారి కూడా కొనసాగించారు. సాంప్రదాయ దుస్తులలో కాలినడకన తిరుమలకు చేరుకున్న జాన్వీ కపూర్ కు అక్కడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపించారు. స్వామివారిని దర్శించుకుని సినిమా ఘనవిజయం సాధించాలని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>