కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) తిరుపతి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 84,220 భక్తులు దర్శించుకోగా.. 40,542 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 3.99 లక్షలు లడ్డులను విక్రయించినట్లు టీటీడీ పేర్కొంది.

