వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు..

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సినీ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) వైసీపీ (YCP) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ విడుదల చేశారు. ఒక నాయకుడు తన వివేకం కోల్పోతే తర్వాతి స్థాయి నాయకత్వం సాధారణంగా పరిస్థితిని సరి చేసుకుంటుంది. కానీ వైసీపీ నేతల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.

పార్టీ లీడర్ మాత్రమే కాక, మొత్తం క్యాడర్, తదుపరి స్థాయి నాయకత్వం కూడా వివేకం కోల్పోయినట్లు వ్యవహరిస్తోందని నాగబాబు పేర్కొన్నారు. వైసీపీ వ్యవస్థ మొత్తం “ఇన్సానిటీ జోన్” (Insanity Zone)లోకి ప్రవేశించింది. ప్రజలు జాగ్రత్తగా గమనించి, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ ‘మావిగన్'(MAVIGUN) వ్యాఖ్యల నేపధ్యంలో నాగబాబు (Nagababu) ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: అమరావతి సరే.. ప్రత్యేక హోదా మాటేంటి?: బొత్స

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>