కలం, వెబ్ డెస్క్ : తెగిన తల్లి చేతిని ఫ్రీజర్‌లో భద్రపరచి, మూడు రోజులుగా మోసుకుంటూ కాన్పూర్ (Kanpur) పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన భారత్ జవాన్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య నిర్లక్ష్యం కారణంగా తన తల్లి చేతి తొలగించాల్సి వచ్చిందని ఆరోపిస్తూ, న్యాయం కోసం జవాన్ ఈ అసాధారణ చర్యకు పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జవాన్ తల్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో మొదట పారస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మార్గమధ్యంలో తీవ్ర నొప్పి పెరగడంతో కాన్పూర్‌లోని కృష్ణా ఆసుపత్రికి తరలించాడు.
అక్కడ చికిత్స పొందుతుండగా వైద్యుల నిర్లక్ష్యం వల్ల చేతికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని జవాన్ ఆరోపించాడు. పరిస్థితి విషమించడంతో మళ్లీ పారస్ ఆసుపత్రికి తరలించగా, ఇన్ఫెక్షన్ నియంత్రణలోకి రాకపోవడంతో మే 17న ఆమె కుడి చేతిని తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటనపై రైల్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో నిరాశకు గురైన జవాన్, తెగిపోయిన తల్లి చేతిని ఫ్రీజర్‌లో భద్రపరచి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రావడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్న కొడుకు ఈ పరిస్థితికి దిగాల్సి రావడం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ సంఘటనపై స్పందించిన కాన్పూర్ (Kanpur) పోలీస్ కమిషనరేట్.. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రకటించింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు జవాన్ ఫిర్యాదు చేయగా.. కృష్ణా ఆసుపత్రి, పారస్ ఆసుపత్రి రెండింటి పాత్రపై విచారణ జరపాలని సిటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా తెగిపోయిన చేతికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి, అన్ని వైద్య రికార్డులను సమీక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఫలితాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తెగిన చేత్తో కమీషనరేట్‌కు ఐటీబీపీ జవాన్
-శ్వాస తీసుకోవడంలో తల్లికి ఇబ్బంది కావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించిన జవాన్
-ఆమెకి తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో కుడి చేయి మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో తీసేసిన వైద్యులు
– హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని… pic.twitter.com/DlUJeZyasQ— Kalam Daily (@kalamtelugu) May 23, 2026
Read Also: వినేశ్ ఫోగట్ ట్రయల్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Follow Us On : WhatsApp

