హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు(IT Raids) చేసింది. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా సోదాలు జరిపారు అధికారులు. ప్రతి ఒక్కరూ చెల్లించిన ట్యాక్స్‌లు, వారికి ఉన్న ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పిస్తా హౌస్(Pista House), షా గౌస్(Shah Ghouse) హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ రెండు హోటల్లు ఏడాదికి వంద కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఇవి హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర నగరాల్లో కూడా వ్యాపారం చేస్తున్నాయి. దుబాయ్‌లో కూడా వీటి బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ హోటళ్లపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. దాంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు.
Read Also: ‘డిజిటల్ అరెస్ట్’తో రూ. 31 కోట్లకు టోకరా
Follow Us on: Youtube

