పదవి కోసం ఆశపడటంలో తప్పే లేదని కర్ణాటక(Karnataka) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) అన్నారు. ఎవరైనా పదవులు అందుకోవాలని ఆశపడతారని చెప్పారు. తాజాగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు తీవ్రతరం అయ్యాయి. ప్రతి చోట మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది? అసలు విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? అన్న చర్చ మొదలైంది. ఇదే అంశంపై తాజాగా డీకే శివకుమార్ స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పదవిని ఆశించడం సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డీకే శివకుమార్ మాట్లాడుతూ… “పదవి కోరుకోవడం లోపమేంటి? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి బాధ్యతలు అప్పగించే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. పార్టీ కోసం శ్రమించిన వారికి ఆశలు ఉండటం సహజం. అలాంటి ఆశలు తప్పు అంటారా? వారిలో అనేక మంది పార్టీ కోసం అనేక త్యాగాలు చేసి పనిచేసిన వారున్నారు” అని శివకుమార్(DK Shivakumar) పేర్కొన్నారు.
Read Also: మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేత హిడ్మా ?
Follow Us on: Youtube

