Mobile Popup Ad
Mobile Popup Ad

ఇజ్రాయెల్ ప్రధాని చనిపోలేదు.. సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్:  ఇరాన్, ఇజ్రాయెల్ (Iran – Israel) మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. కొన్ని వారాల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Netanyahu)ను కూడా ఇరాన్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయని నెట్టింట ఓ ప్రచారం జరుగుతోంది. నెతన్యాహు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడ్డాడమో జరిగిందని పలువురు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ పుకార్లకు చెక్ పెడుతూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ట్విట్టర్‌లో ఓ వీడియో క్లిప్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన స్టాఫ్‌తో కలిసి ఓ హోటల్‌లో టీ తాగుతూ కనిపించారు. అయితే ఇదంతా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ అని పలువురు అంటున్నారు.

తాజాగా ఈ అంశంపై భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పందించారు. నెతన్యాహు బతికే ఉన్నారని.. ఆ వీడియో AI కాదని చెప్పుకొచ్చారు. తాను ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆయనను ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్యక్తిగతంగా చూశానని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు. ఇదిలాఉంటే జెరూసలేంలోని టీ కేప్ ‘ది సతాఫ్’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. ప్రధాని, ఆయన కార్యాలయానికి ఆతిథ్యం ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని సదరు వీడియోను మళ్లీ రీ పోస్టు చేసింది. దీంతో నెతన్యాహు (Netanyahu) మరణించాడనే వార్తలకు చెక్ పెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. ఈ కొవలోనే పలు ప్రకటనలు వస్తున్నాయని తెలుస్తోంది.

Read Also: “ఇది సీఎం దారి”.. మంత్రి దామోదరకు అవమానం!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>