కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) సంచలన ప్రకటన చేశారు. రష్యా, పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత ఇరాన్ లో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్టు మరోసారి స్పష్టం చేస్తున్నామని మసూద్ వెల్లడించారు. యుద్ధాన్ని ఆపి, శాంతి స్థాపన నెలకొల్పాలంటే తాము పెట్టే మూడు ప్రధాన కండిషన్స్ (Iran 3 Conditions)ని అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాలని ఆయన తేల్చి చెప్పారు.
మొదటగా ఇరాన్ దేశపు చట్టబద్ధ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని, రెండవది యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, మూడవది భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ దాడులు చేయబోమని అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టమైన హామీ ఇవ్వాలని మసూద్ పేర్కొన్నారు. ఈ మూడు షరతుల (Iran 3 Conditions)కు అంగీకరిస్తే తక్షణమే హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేసి, అంతర్జాతీయ నౌకలకు అనుమతి ఇస్తామని ఆయన ప్రకటించారు.
ప్రపంచ చమురు సరఫరాలలో హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం నుంచే జరుగుతుంది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు కొరత ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ దేశాలలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇరాన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దీనిపై ఎలా స్పందిస్తాయో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Read Also: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. సిలిండర్ల బుకింగ్ గడువు పెంపు
Follow Us On: Facebook


