Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్, గ్యాస్ కొరతపై లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ కొరత దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రెస్టారెంట్లు, క్యాంటిన్లకు ఈ సెగ తగిలింది. వంట గ్యాస్ సిలిండర్లు బుక్ కాకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. కాగా ఈ సమస్యపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri)  పార్లమెంటులో స్పందించారు. ఆయిల్ సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. సంక్షోభసమయంలో దేశం మొత్తం ఒక్కతాటి మీద ఉండాలని కోరారు. దేశంలో గ్యాస్, పెట్రో, డీజిల్ కొరత ఏర్పడకుండా తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 5 రోజుల్లో ఎల్ పీజీ ఉత్పత్తిని పెంచామని చెప్పారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు ఆటంకం లేకుండా ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గల్ఫ్ దేశాల నుంచి 60 శాతం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదని నిజమేనని చెప్పిన హర్దీప్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని చెప్పారు.

గృహ అవసరాలకే తమ ప్రాధాన్యం

గృహ అవసరాలకే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. దేశంలో పెట్రోలు, డీజిల్‌కు కొరత లేదని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలకు బదులుగా నార్వే, కెనడా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 33 కోట్ల మంది గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘గ్యాస్ ఉత్పత్తిపై మార్చి 9న త్రిసభ్య కమిటీ వేశాం. చమురు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాం. రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాం. గ్యాస్ సమస్య కేవలం భారతదేశంలో మాత్రమే లేదని ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది’ అని హర్దీప్ పేర్కొన్నారు. కుల్ దీప్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు తీవ్రమైన నిరసన తెలిపాయి. అయినప్పటికీ ఆయన తన ప్రసంగం కొనసాగించారు. అంతకుముందు రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ.. ఎల్పీజీ విషయంలో ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోందని పేర్కొన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేందుకు అమెరికా నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రశ్నలకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri)  స్పందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>