కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బీబీనగర్ (Bibinagar) మండలం పడమటి సోమారం (Padamati Somaram) గ్రామంలో అప్పుడే పుట్టిన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో వదిలేసి వెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలోని లింగ బసవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఎముకలు కొరికే చలిలో శిశువు ఆర్తనాదాలు మిన్నంటాయి. అయితే శిశువు కేకలు విని స్థానికులు స్పందించి చేరదీశారు. వెంటనే శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతోనే తల్లితండ్రులు అమానుష చర్యకు పాల్పడ్డట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.
Read Also: ఆటో డ్రైవర్‌ను హత్యచేసి తగులబెట్టిన వ్యక్తికి ఉరిశిక్ష
Follow Us On : WhatsApp


