కలం, వరంగల్ బ్యూరోః ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీ జరుగుతోంది. పలు చోట్లా యూరియా కొరత ఉంటే.. మరికొన్ని చోట్ల రైతులకు సరిపడ నిల్వలున్నాయి. లైన్లో ఎక్కువసేపు నిల్చోవడానికి ఇబ్బంది పడుతున్న రైతులు వరుస క్రమంలో చెప్పులను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ (Warangal) జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. జిల్లాలోని నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రైతులు క్యూ కట్టారు. ఓ రైతు ఏకంగా మద్యం బాటిల్ లైన్ లో పెట్టడం ఇతర రైతులను ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also: వరంగల్ బల్దియా ముందు ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
Follow Us On: Youtube


