కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత రూపాయి విలువ పతనమవుతోంది (Rupee Depreciation). ఎన్నడూ లేని రీతిలో డాలరుతో రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి దిగజారింది. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ రూపాయి విలువ పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం ఇంట్రా ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయిని పోలీస్తే కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం సమయంలో కొత్త రికార్డును బద్ధలు కొడుతూ 91.74 స్థాయికి పడిపోయింది. నేడు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 91..08 వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి పెరగడం ఒక కారణం అయితే ఫారెన్ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నిరంతరంగా పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో రూపాయి పతనానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
Rupee Depreciation | రూపాయి పతనం బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. రూపాయి బలహీనపడినప్పుడు దిగుమతి చేసుకునే గోల్డ్, సిల్వర్ ధరలు అమాంతం పెరుగుతాయి. దీనికి కారణం వాటిని కొనుగోలు చేయాలంటే డాలర్ రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఎక్కువ ఉండడం వల్ల భారత కరెన్సీని ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు పెట్టుబడిదారులు వారి సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి లాంటి విలువైన ఖనిజాలపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కారణంగా డిమాండ్ ఎక్కువై ధరలు మరింత పెరుగుతాయి.
ఇప్పటికే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు బంగారం ధర రూ. 1,57,260, వెండి రూ. 3,45,000 గా కొనసాగుతోంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల గోల్డ్, సిల్వర్ ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పుత్తడి మరింత స్పీడుగా పరుగులు తీసే అవకాశం ఉంది. మరోవైపు వెండి ఇప్పటికే మూడున్నర లక్షలకు దగ్గరగా చేరువయింది. ఈ తరుణంలో రూపాయి విలువ కనిష్టానికి పతనమవడంతో వెండి జిగేలుమనడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే పెళ్లిళ్ల సీజన్ కావడంతో డా బంగారం, వెండి రేట్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.


