epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మొదటి టీ20 భారత మహిళలదే

కలం, వెబ్​డెస్క్​: సమష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు (India Women) తొలి టీ20లో గెలుపొందింది. ఆదివారం విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన పర్యాటక జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్​లో ఓపెనర్​ విష్మీ గుణరత్నె(39; 43 బంతుల్లో 1 ఫోర్​, 1 సిక్స్​) టాప్​ స్కోరర్​. చమరి ఆటపట్టు(15), హాసిని పెరీరా(20), హర్షిత మాధవి(21) రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్​, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్​ తీశారు. లంక జట్టులో ముగ్గురు రనౌట్​ కావడం విశేషం.

అనంతరం భారత్​ 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయం అందుకుంది. జెమీమా రోడ్రిగ్స్ ​(65; 44 బంతుల్లో 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో జట్టును గెలిపించింది. ఓపెనర్​ షఫాలీ వర్మ(9), మంధాన(25; 25 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్​ హర్మన్​ ప్రీత్​ కౌర్​(15 నాటౌట్​) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కావ్య, రణవీర చెరో వికెట్​ పడగొట్టారు. ఐదు మ్యాచ్​ల సిరీస్ (INDW VS SLW)​లో భారత్​ 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఇదే వేదికగా ఈ నెల 23న జరుగుతుంది.

Read Also: ఆ ఓటమితో క్రికెట్ మానేద్దామనుకున్నా: రోహిత్ శర్మ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>