epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బిగ్​బాస్​ విన్నర్​ కళ్యాణ్​ పడాల

కలం, వెబ్​డెస్క్​: బిగ్​బాస్​ సీజన్–9​ విన్నర్​గా కళ్యాణ్​ పడాల (Kalyan Padala) నిలిచారు. ఆదివారం గ్రాండ్​ ఫినాలేలో కళ్యాణ్​ను విజేతగా హోస్ట్​ నాగార్జున(Nagarjuna) ప్రకటించారు. ట్రోఫీతోపాటు నగదు మనీని విజేతకు అందించారు. దీంతో ఈ షోలో సామాన్యుడిగా అడుగుపెట్టి విజేతగా నిలిచిన రెండో వ్యక్తిగా కళ్యాణ్​ నిలిచారు. గతేడాది సైతం సామాన్యుడినే ట్రోఫీ వరించడం గమనార్హం. ఆ సీజన్​లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్​ విజేత అయ్యారు. కాగా, షోకు అతిథిగా సినీ నటుడు శ్రీకాంత్​ వచ్చారు. అలాగే ‘ఛాంపియన్​’​ సినిమా ప్రమోషన్​ కోసం రోషన్​, అనస్వర రాజన్​, ‘అనగనగా ఒక రాజు’ సినిమా కోసం నవీన్​ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి; ‘భర్త మహాశయులకు విజ్ఙప్తి’ సినిమా కోసం రవితేజ, ఆషికా రంగనాథ్​, డింపుల్​ హయాతి వచ్చారు. షోలో మొదట సంజన, తర్వాత ఇమ్మాన్యుయేల్​ ఎలిమినేట్​ అయ్యారు. ఆ తర్వాత డీమాన్​ పవన్​ హోస్ట్​ నాగార్జున ఆఫర్​ చేసిన రూ.15లక్షలు తీసుకొని పోటీ నుంచి వైదొలిగారు. అనంతరం రూ.20లక్షలున్న సూట్​కేసును కళ్యాణ్, తనూజ(Thanuja)కు ఆఫర్​ చేయగా ఇద్దరూ తిరస్కరించారు. చివరికి కళ్యాణ్​ పడాలను విన్నర్​గా నాగార్జున ప్రకటించారు. ట్రోఫీ, రూ.35లక్షల చెక్​ అందించారు.

అంచనాలకు అందకుండా.. :

మిగిలిన సీజన్లకు భిన్నంగా ఈసారి షో ఆద్యంతం అంచనాలకు అందకుండా సాగింది. మొదట విన్నర్​ అనుకున్నవాళ్లు అనూహ్యంగా ఆట నుంచి వెళ్లిపోగా, అసలు అంచనా లేనివాళ్లు టాప్​–5లో నిలిచారు. వీరిలో కళ్యాణ్​ పడాల, డీమాన్​ పవన్​ సామాన్యుల కోటాలో అడుగుపెట్టి ఏకంగా టాప్–5 కు చేరుకున్నారు.  కళ్యాణ్​ (Kalyan Padala) ఏకంగా విజేతగా నిలిచారు. టాప్​–5లో నిలిచిన మిగిలిన ముగ్గురు తనూజ, ఇమ్మాన్యుయేల్​, సంజన.

అవే గెలిపించాయి..:

ఏ టాస్క్ ఇచ్చినా వందశాతం న్యాయం చేయడం, ఆటలో స్థిరత్వం, ప్రవర్తనతో ప్రేక్షకుల మనస్సును కళ్యాణ్​ గెలుచుకున్నాడు. షో ప్రారంభం నుంచి ఓటింగ్​లో టాప్​–5లో ఉంటూ వచ్చాడు. అయితే, తనూజ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. ఒక దశలో తనూజే విన్నర్​ అని అందరూ అనుకున్నారు. హోస్ట్ నాగార్జునకు ​‘దత్తపుత్రిక’ అనే ట్యాగ్​ కూడా ఈ అంచనాలకు కారణమయ్యాయి. అయితే, చివరి వారాల్లో తనూజ ఊహించని విధంగా వెనకబడి పోయింది. ముఖ్యంగా ఓటింగ్​లో చాలా మార్పు వచ్చింది. దీంతో కళ్యాణ్ ఆమె కంటే అధికంగా ఓట్లు సాధించి విజేతగా నిలిచాడు.

ఆఖర్లో అనూహ్యం:

షో చివరికి వచ్చేసరికి ఓటింగ్​ అనూహ్యంగా మారిపోయింది. రీతూ వెళ్లిపోయిన తర్వాత డీమాన్​ పవన్​ అద్భుతంగా పుంజుకోవడం దీనికి కారణం. అప్పటివరకు ఇంట్రావర్ట్​లా ఉన్న డీమాన్​ చివరిలో విశ్వరూపం చూపించాడు. టాస్కుల్లో సత్తా చాటాడు. ఆడియన్స్​ను ఫిదా చేశాడు. చివరి మూడు రోజుల ముందు వరకు ఓటింగ్​లో నాలుగో స్థానంలో ఉన్న డీమాన్​ ఆ తర్వాత బాగా పుంజుకొని మూడో స్థానంలోకి వచ్చేశాడు. ఇమ్మాన్యుయేల్​ను వెనక్కి నెట్టి థర్డ్​ ప్లేస్​ చేరుకున్నాడు. మరోవైపు మొదట్లో జోక్​లు, కామెడీతో అలరించిన ఇమ్మాన్యుయేల్​ చివర్లో అదే మ్యాజిక్​ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన మరో విషయం సంజన. రెండు వారాల కంటే ఎక్కువ షో లో ఉండదని అందరూ అనుకుంటే ఏకంగా టాప్–5కి చేరింది. టాస్క్​ల్లోనూ బలమైన పోటీ ఇచ్చింది.

మంగ్లీ ఆట, పాట.. :

షో ప్రారంభానికి ముందు ఈ సీజన్​లో పాల్గొన్న 22 మంది కంటెస్టెంట్లు తమ కుటుంబసభ్యులతో వచ్చారు. షోలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ‘బాయిలోనే బల్లిపలికే’ అంటూ మంగ్లీ ఆట, పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read Also: రూటు మార్చిన రామ్..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>