epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ ఓటమితో క్రికెట్ మానేద్దామనుకున్నా: రోహిత్ శర్మ

కలం, వెబ్​ డెస్క్​ : 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా(Australia)పై ఓటమి తర్వాత తాను క్రికెట్ మానేయాలని ఆలోచించానని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్ ఓటమి తనను తీవ్రంగా కుంగదీసిందని, ఆ సమయంలో క్రికెట్​ మానేయాలని అనిపించిందని చెప్పారు. గుర్గావ్‌లోని మాస్టర్స్ యూనియన్ ఈవెంట్‌లో ఆదివారం మాట్లాడుతూ రోహిత్ ఈ విషయాలు పంచుకున్నారు.

2022లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరల్డ్‌కప్ గెలవడమే తన లక్ష్యమని రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపారు. ‘నేను వరల్డ్​ కప్​ కోసం చాలా కష్టపడ్డాను. అది 2023 వన్డే వరల్డ్‌కప్ అయినా, T20 వరల్డ్‌కప్ అయినా ‌కప్ గెలవడమే నా టార్గెట్. అది జరగకపోవడంతో నేను పూర్తిగా కుంగిపోయాను. ఒక దశలో ఈ స్పోర్ట్‌ను ఇక మానేద్దాం అనుకున్నాను’ అని రోహిత్ చెప్పారు.

ఆ ఓటమి తర్వాత కొన్ని నెలల పాటు కోలుకోవడానికి సమయం పట్టిందని, స్వీయ పరిశీలన చేసుకుని క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను గుర్తుచేసుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని వివరించారు. టోర్నమెంట్ తర్వాత బ్రేక్ తీసుకుని, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో వైట్-బాల్ సిరీస్‌లకు దూరమయ్యానని చెప్పారు. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి ఆ బ్రేక్ సహాయపడిందని తెలిపారు.

Read Also: తుది మెట్టుపై యువ భారత్ బోల్తా: అండర్–19 విజేత పాక్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>