epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అన్నాహజారే సంచలన నిర్ణయం : జనవరి 30న నిరాహార దీక్ష

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేస్తున్నట్లు అన్నాహజారే  ప్రకటించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పదేపదే హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఏడు లేఖలు రాశానని, కానీ ఎలాంటి స్పందనా రాలేదని ఆయన వెల్లడించారు.

గతంలో లోకాయుక్త(Lokayukta) చట్టం అమలు కోసం అన్నాహజారే(Anna Hazare) 2022లో కూడా రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి హామీతో ఆందోళనను విరమించారు. ఆ తర్వాత ఓ కమిటీ ఏర్పాటై, డ్రాఫ్ట్ తయారైంది. 2022 డిసెంబర్ 28న అసెంబ్లీ, 2023 డిసెంబర్ 15న లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ.. మూడు సవరణలు సూచించారు. అయినప్పటికీ చట్టం క్షేత్రస్థాయిలో అమలు కాలేదు.

Read Also: ఓటుబ్యాంకు కోసం బంగ్లా వలసల్ని వాడుకున్న కాంగ్రెస్: ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>