కలం, వెబ్‌డెస్క్: ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (India Oman Free Trade) రెండు దేశాలకూ కొత్త శక్తివంటిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఒమన్(Oman) రాజధాని మస్కట్ చేరుకున్న ప్రధాని.. గురువారం అక్కడ జరిగిన భారత్–ఒమన్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సు రెండు దేశాల మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమన్నారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త శక్తిని, నమ్మకాన్ని ఇస్తుందని చెప్పారు.
అంతకుముందు ప్రధాని మోదీ సమక్షంలో రెండు దేశాల ప్రతినిధులు స్వేచ్ఛా వాణిజ్య(India Oman Free Trade) ఒప్పందంపై సంతకం చేశారు. జౌళి, వ్యవసాయ, తోలు ఉత్పత్తులపై ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. కాగా, ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం చేసినందుకుగాను ఈ అవార్డు ఇచ్చింది. ప్రధాని మోదీకి ఇప్పటివరకు 28 దేశాలు తమ అత్యున్నత పురస్కారం ఇవ్వగా, ఇది 29వది.
Read Also: స్టూడెంట్స్‌కు ల్యాప్‌టాప్‌లు.. తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్
Follow Us On: X(Twitter)


