కలం, వెబ్‌డెస్క్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య వి.వి. సుమలతా దేవి (Sumalatha Devi) ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ యూనియన్‌కు మొట్టమొదటిసారిగా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం ఆనందంగా ఉందన్నారు. సుమలతా దేవి విజయం యూనియన్‌కు కొత్త రూపాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. వి.వి. సుమలతా దేవి (Sumalatha Devi) మాట్లాడుతూ.. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. యూనియన్‌లో ఉన్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీశైలం యాదవ్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, జానీ మాస్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేశ్, యం. రాజు, సహకార్యదర్శులుగా కే. కిరణ్ కుమార్, ఏ. రాము, కార్యనిర్వాహక కార్యదర్శిగా యు. శివకృష్ణ, కమిటీ సభ్యులుగా కె. సతీశ్ గౌడ్, కె. శ్రీదేవి, పి. సురేశ్, ఎస్. వేదాంత, మనోహర్, ఎల్. కృష్ణ, బి. సుమన్, ఆర్. బోస్, ఎస్. శృతి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్యామ్ సుందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కోశాధికారి జి. భీముడు (శ్రీకాంత్) పాల్గొన్నారు.
Read Also: కామెరూన్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్‌ను చూపించారు: సుకుమార్
Follow Us On: Instagram


