కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలంలోని సూరేపల్లి గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో చర్చించనున్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా 3,658 పాస్ పుస్తకాలు, వేమూరు నియోజకవర్గంలో 1,795 పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అలాగే సూరేపల్లిలో పంట పొలాలను సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం వేమూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.

