కలం, తెలంగాణ బ్యూరో: ఎండ భగ్గుమంటున్నది.. ఈ టైమ్‌లో ప్రకృతి ఒడిలో సేదతీరితే మనసుకు కాస్త హాయిగా ఉంటుంది.. సమ్మర్లో ఎంజాయ్ చేసినట్టూ ఉంటుంది. ఇందుకోసం ఏ హిల్ స్టేషన్ కో, ఇతర రాష్ట్రానికో వెళ్లక్కర్లేదు. తెలంగాణలోనే అద్భుతమైన, ఆహ్లాదకరమైన, ప్రకృతి సోయగాలతో కూడిన పర్యాటక ప్రాంతాలు (Summer Tourist Places) ఎన్నో ఉన్నాయి. ‘తెలంగాణ ఊటీ’ అనంతగిరి హిల్స్.. ‘తెలంగాణ నయాగరా’ బొగత జలపాతం.. ‘తెలంగాణ మాల్దీవ్స్’ లక్నవరం.. ‘తెలంగాణ మినీ మాల్దీవ్స్’ సోమశిల.. కాకతీయుల కళా వైభవాలు వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం.. బోటింగ్ విహారానికి నాగార్జున సాగర్, సింగూర్ డ్యామ్.. ప్రకృతి ఒడిలో పరవశించేందుకు మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ,
కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చువరీ.. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో కుంటాల, పొచ్చెర జలపాతాలు..
ట్రెక్కింగ్‌కు ఫేమస్ నల్లమల.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.
మరో 15 రోజుల్లో పిల్లలకు సమ్మర్ హాలీ డేస్ వస్తాయి. ఈ సమ్మర్లో తెలంగాణలో మీకు నచ్చిన ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేయండి. తెలంగాణ టూరిజంపై ‘కలం ప్రత్యేక కథనం’ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?
Follow Us On : WhatsApp

