కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని అమరావతిలో (Amaravati) తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. మంత్రి నారాయణతో తన సమస్య చెప్పుకుంటూ ఓ రైతు కుప్పకూలిపోయాడు. అమరావతిలోని మందడంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు అలైన్‌మెంట్‌లో మందడంలో మొత్తం 100 మంది ఇండ్లు కోల్పోయారు. అందులో ఈ వృద్ధుడి ఇల్లు కూడా ఉంది.
అయితే తనకు న్యాయం చేయాలంటూ వృద్ధుడు కోరారు. అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలోని మందడంలో రోడ్లను కోల్పోతున్న బాధితులతో మంత్రి నారాయణ (Minister Narayana) సమావేశమయ్యారు. అయితే బాధితుడు రామారావు.. తమకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
తమకు వాగులో ఇంటి స్థలం ఇచ్చారని వాపోయారు. ’ మేం పొలాలు ఇచ్చాం. ఇండ్లు కోల్పోయాం. మాకేమో స్థలాలు వాగులో ఇచ్చారు. మేం బొచ్చ పట్టుకొని అడుక్కోవాలా?‘ అంటూ రామారావు వాపోయారు. అయితే రామారావుకు గతంలోనే బైపాస్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో రామారావుకు స్థానిక డాక్టర్లు సీపీఆర్ నిర్వహించినప్పటికీ కాపాడలేకపోయారు.
Read Also: సితార బ్యానర్‌లో నాని కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరు?
Follow Us On: Sharechat


