Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు అందుకున్న జిల్లాలు ముందస్తు చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రాయలసీమ జిల్లాలు – అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరులకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.
Rain Alert | అదే విధంగా కోస్తా ఆంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూడా ఆకస్మిక వరదల ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ ప్రదేశాల్లో నీటి మట్టం పెరగవచ్చని, తక్కువ భూమి ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also: దీపావళి అమ్మకాలు @రూ.6లక్షల కోట్లు

