అల్లూ వారి ఇంట పెళ్ళి బాజా అతి త్వరలో మోగనుంది. ఈ విషయాన్ని అల్లూ శిరీష్(Allu Sirish) ప్రకటించాడు. అది తనదే అని కూడా షేర్ చేసిన శిరీష్.. అమ్మాయి ఎవరన్నది మాత్రం సీక్రెట్‌గా ఉంచాడు. చాలా కాలంగా ప్రేమల ఉన్నతాము అతి త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నామంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అప్పటి నుంచి అల్లూ శిరీష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త కూతురు నయనిక(Nayanika)తో ప్రేమలో ఉన్న శిరీష్.. అక్టోబర్ 31న నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌లో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భార్య ఎవరో శిరీష్.. దీపావళి సందర్భంగా చూపించాడు.
అల్లూ వారి ఇంట జరిగిన దీపావళి వేడుకల్లో నయనిక కూడా పాల్గొంది. ఈ సందర్భంగానే దిగిన ఫ్యామిలీ ఫొటోను అల్లూ అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నయనిక తళుక్కుమంది. శిరీష్ ముందు కూర్చున్న అమ్మాయే నయనిక. దీంతో నయనిక ఎవరనేది అందిరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫొటోను డౌన్‌లోడ్ చేసి ఫ్యాన్స్ అంతా శిరీష్(Allu Sirish)కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Read Also: వెంకీ, త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్ ఫిక్స్..

